బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే ఇక లేరనే వార్త సోషల్ మీడియాలో ఆమె అకౌంట్ ద్వారా పెట్టిన పోస్టు కలకలం రేపింది. ఆకస్మాత్తుగా పూనమ్ పాండే చనిపోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు. ఆమె ఫ్యాన్స్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కానీ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం పట్ల ఆశ్చర్యం వేసినా…కొంత అనుమాలకు మాత్రం తావిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా ఉట్టిదే అంటున్నారు.
Advertisement
Advertisement
జనాలను మోసం చేసేందుకు ఇలా చేసిందంటున్నారు. పూనమ్ పాండే ఆకస్మాత్తుగా మరణిచండమేంటీ అనే సందేహం చాలా మదిలో మొదలైంది. ఆమెకు సంబంధించిన వ్యాధిని సెర్చ్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె అకౌంట్లో పెట్టిన పోస్టులో ఉంది. అయితే దీనిపై అవగాహన ఉన్నవాళ్లంతా ఇది జరగడం అసంభం అంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ తో మరణించడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు. అదే సమయంలో సడెన్ గా ఇది జరగదంటున్నారు. 50ఏళ్లలోపు ఉన్నవాళ్లు ఈ క్యాన్సర్ కు గురైతే చికిత్స ద్వారా బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం పూనమ్ పాండే వయస్సు 32 సంవత్సరాలు. ఈమధ్యే పెళ్లి కూడా చేసుకుంది. భర్తతో గొడవలు..కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం…విడాకుల వరకు వెళ్లింది. పెళ్లైన ఏడాదికి భర్తతో విడిపోయింది.
ఈ క్యాన్సర్ వచ్చిన వెంటనే ప్రాణాలు పోవడం అస్సలు జరగదు. కొన్నాళ్లపాటు చికిత్స తీసుకున్న తర్వాత చివరి స్టేజీలో మాత్రమే ఇలా జరుగుతుంది. దీనికి దాదాపు 15 నుంచి 20ఏళ్లు పడుతుందని అంటున్నారు. నిజంగానే చనిపోతే కారణం వేరే అయి ఉంటుంది..సర్వైకల్ క్యాన్సర్ అనేది మాత్రం కాదంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలంటున్నారు నెటిజన్లు.