సాధారణంగా కొందరికీ నటన హాబీ.. మరికొందరికీ అదే జీవనాధారం. ఇలా కొంత మంది కోటీశ్వరుల కుటుంబాల నుంచి వస్తే.. మరికొంరదూ నటనపై ఉన్న ఆసక్తికారణంగానే సినిమా రంగంలో స్థిరపడుతుంటారు. సినిమాలే జీవనాధారంగా ఇండస్ట్రీకి వచ్చిన వారు తొలినాళ్లలో డబ్బుకు చాలా ఇబ్బంది పడేవారు. చాలీ చాలనీ డబ్బుతో జీవనం సాగించేవారు. నటుడిగానో.. నటిగానో నిలదొక్కుకున్న తరువాత కూడా అదే పద్దతిని పాటించేవారు. అలాంటి కష్టాల గురించి తెలిసిన కొందరూ మాత్రం నిర్మాత పట్ల.. దర్శకుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించేవారు.
Advertisement
ఇండస్ట్రీలో అలాంటి వారు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎక్కువ శాతం డబ్బు దగ్గర ఎంతో నిక్కచ్చిగా ఉంటారు. అలాంటి వారిలో శోభన్ బాబు ఒకరు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డబ్బుకు శోభన్ బాబు చాలా ఇబ్బంది పడ్డాడట. హీరోగా నిలదొక్కుకున్న తరువాత రెమ్యునరేషన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునే వారు. డబ్బు చేతిలో పడితేనే కానీ షూటింగ్ కి వచ్చేవారు కాదట. ఈ మాట ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. నిర్మాత ఇస్తానన్న డబ్బు సమయానికి అందకపోవడం వల్ల షూటింగ్ వెళ్లని సందర్భాలు చాలానే ఉన్నాయట.
Advertisement
డబ్బు విషయంలో అంత కచ్చితంగా ఉండటానికి కారణం ఏంటనే సీనియర్ నటులు ప్రస్తావించినప్పుడు.. దానికి ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. శోభన్ బాబు సంపాదించిన ప్రతీ రూపాయిని భూమిపై పెట్టేవారట. ఒక సినిమా ఒప్పుకుంటే.. దానికి రెమ్యునరేషన్ ఎంత..? దానిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు ఎంత చెల్లించాలనే విషయాలను నోట్ బుక్ లో రాసుకునేవారట. ఒక సినిమాకి రావాల్సిన రెమ్యునరేషన్ అనుకున్న సమయానికి అనుకున్నంత వస్తేనే షెడ్యూల్ ప్రకారం.. తాను కొన్న భూమికి డబ్బు చెల్లించగలుగుతారు. అందుకే ఆ విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారట శోభన్ బాబు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!