నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనల్లో ఆయన పెళ్లి కూడా ఒకటి. అక్కినేని కుటుంబంలో ఎవ్వరూ అంతగా చదువుకోలేదు. అందుకే ఏఎన్నార్ చదువుకోవడం కోసం సిద్ధమయ్యారు.
Advertisement
తమ కుటుంబంలో ఎవ్వరూ చదువుకున్న లేరు కాబట్టి అక్కినేనిని కూడా చదివించడం వృధా అని భావించింది ఆయన తల్లి. చిన్న చిన్న నాటకాలు వేస్తూ పేరు సంపాదించుకున్నారు. అందులో మంచి పేరు తెచ్చుకుంటాడని నాటకాలను ప్రదర్శించే వ్యక్తికి ఏఎన్నార్ ను అప్పగించారు. అలా మొదటి నాటకం ద్వారా అర్థరూపాయి సంపాదించారు అక్కినేని.
విజయవాడ రైల్వే స్టేషన్ లో ఘంటసాల బలరామయ్య అక్కినేనిని చూసి సినిమాలలో అవకాశం ఇస్తాననడంతో మద్రాస్ కి పయణమయ్యాడు. అదే సమయంలో తన బిడ్డ సావాసాలు పడతాడేమోనని భయపడి పెళ్లి చేసి పంపిస్తే మరో అమ్మాయి జోలికి వెళ్లడని భావించింది. అక్కినేని చిన్నతనం నుంచే అతని మేనత్త కూతురుని ఇచ్చేయాలనుకున్నారు. తన అన్నయ్య కూతురు కావడంతో విషయం అతనికి చెప్పింది అక్కినేని తల్లి. అప్పటికీ ఏ ఎన్నార్ వయస్సు 19 ఏళ్లు. ఆ అమ్మాయి 15 సంవత్సరాలు. కొడుగు గురించి బాధపడుతున్న తల్లిని చూసి ఆమె అన్నయ్య, అక్కినేని మేనమామ ఓ మాట అన్నాడు. అబ్బాయి తల్లివి అయి ఉండి నువ్వెంత భయపడితే.. సినిమా వాడికి పిల్లనివ్వాల్సిన నేను ఎంత ఆలోచించాలన్నాడట.
Advertisement
ఇక అదే సమయంలో అక్కినేని అప్పుడే నాకు పెళ్లి ఏంటి..? నేను జీవింలో స్థిరపడలేదు. మద్రాస్ వెళ్తున్నాను. అక్కడ అవకాశాలు వస్తాయో రావో తెలియదు. ఇప్పట్లో పెళ్లి గురించి ప్రస్తావించకూడదు. అంతలోనే తన గురించి మనస్సులో ఏమనుకుంటుందో గ్రహించిన అక్కినేని నీ మీద ఒట్టేసి చెబుతున్నాను. ఎలాండి చెడు పనులు అక్కడ నేను చేయనని.. నన్ను నమ్ము అమ్మ అని మాట ఇఛ్చారట. అలా 1944లో సీతారామ జననం సినిమాతో పూర్థి స్థాయి కథానాయకుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించారు అక్కినేని. హీరోగా మరో ఐదు సినిమాల్లో నటించిన తరువాత 1949 ఫిబ్రవరి 19న అన్నపూర్ణను పెళ్లి చేసుకున్నారు. సినిమాలలోకి వెళ్లాడనే కారణంతో మేనమామ తన కూతురినీ ఇచ్చేందుకు ఇష్టపడలేదట. అందుకే బయటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. తన కెరీర్ లో గొప్ప సినిమాగా చెప్పుకునే కీలుగుర్రం సినిమా విడుదలకి ముందే రోజే అక్కినేని పెళ్లి జరగడం విశేషం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!