Home » GAME ON MOVIE REVIEW : గేమ్ ఆన్ మూవీ రివ్యూ.. సైకాలాజికల్ థ్రిల్లర్ ఆకట్టుకుందా ?

GAME ON MOVIE REVIEW : గేమ్ ఆన్ మూవీ రివ్యూ.. సైకాలాజికల్ థ్రిల్లర్ ఆకట్టుకుందా ?

by Anji
Ad

గీతానంద్, నేహా సోలంకి హీరో, హీరోయిన్‌లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్‌ ఆన్‌’.  ఇవాళ  విడుదలైన ఈ మూవీతో దయానంద్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని రవి కస్తూరి నిర్మించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలో  తెలుసుకుందాం.

Advertisement

నటీనటులు : గీతానంద్, నేహా సోలంకి, మధుబాల, ఆదిత్య మీనర్, శుభలేఖ సుధాకర్, వాసంతి, కిరిటీ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్,  దర్శకుడు :   దయానంద్

నిర్మాత :  రవి కస్తూరి

సంగీతం :  అభిషేక్

సినిమాటోగ్రఫీ : అరవింద్ విశ్వనాథ్

ఎడిటర్ : వంశీ అట్లూరి

కథ మరియు విశ్లేషణ : 

సిద్దు (గీతానంద్) ఓ అనాథ. ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు.  ఆ కంపెనీ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేయలేక బాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. ఆ తర్వాత బాస్ ఓ విషయంలో అతని చేసిన పనికి ఆఫీస్ నుంచి తొలిగిస్తాడు. మరోవైపు అతను నమ్ముకున్న స్నేహితుడు, ప్రియురాలు అతన్ని మోసం చేస్తారు. ఈ క్రమంలో ఆ*త్మ* హ** త్య చేసుకోవాలనుకుంటాడు.  అదే సమయంలో అతనికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తోంది. అందులో అతను సిద్దుకు ఓ టాస్క్ ఇస్తారు. వాళ్లు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు వేస్తామని చెబుతారు.  ఈ నేపథ్యంలో అతను వాళ్లు చెప్పిన పని చేసాడా.. ? ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ? అనాథ అనుకున్న అతని జీవితంలో అమ్మ, తాత ఉంటారు. వాళ్లు ఏమయ్యారు ? సారా (నేహా సోలంకి) ఎవరు ? ఈ క్రమంలో సిద్దుకు ఫోన్‌లో అజ్ఞాతవ్యక్తి చెప్పిన టాస్క్ ను ఎలా కంప్లీట్ చేసాడనేది తెలియాలంటే గేమ్ ఆన్ మూవీని థియేటర్లలో  చూడాల్సిందే.

Advertisement

 ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను లూజర్‌గా చూపించడం.. ఆ తర్వాత అజ్ఞాతవ్యక్తి ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసే క్రమంలో విన్నర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమాలో చూపించాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే మానసికంగా బలహీనుడైన హీరో.. ఎలా బలవంతుడిగా మారే క్రమాన్ని ఇంట్రెస్ట్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు.  సైకాలాజికల్‌గా సాగే ఈ థ్రిల్లర్‌లోకి ప్రేక్షకులను వెంటనే తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.  అజ్ఞాతవ్యక్తి హీరోలకు ఒక్కో టాస్క్‌కు కొంత అమౌంట్‌ను అతని ఖాతాలో వేయడం అనేది కొంత లాజిక్‌గా అనిపించదు.  అటు హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ యూత్ కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.  హీరో కొత్త నటుడైన అతనితో మంచి యాక్టింగ్ రాబట్టాడు.   హీరోకు అజ్ఞాతవ్యక్తి ఎందుకు టాస్క్ ఇచ్చాడనేది క్లైమాక్స్‌లో చూపించారు.  కొత్త నటుడు అయిన..గీతానంద్ యాక్టింగ్, ఫైటింగ్ అన్ని విషయాల్లో ఈజ్‌తో నటించాడు. హీరోకు మంచి భవిష్యత్ ఉంది. నేహా సోలంకి ఉన్నంతలో పర్వాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ నటించి వావ్ అనిపించింది. ఇక ఈ సినిమాలో ఆదిత్య మీనన్ నటన ఆకట్టుకుంది. మధుబాల, శుభలేఖ సుధాకర్ తమ పరిధి మేరకు రాణించారు. ఫైనల్ గా లాజిక్‌కు దూరంగా ఉన్న  ఓవరాల్‌గా ఓకే అనిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్:

  • స్టోరీ
  • ఇంటర్వెల్ బ్యాంగ్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ క్లైమాక్స్
  • లాజిక్ లేని సన్నివేశాలు
  • ఎడిటింగ్

రేటింగ్: 3/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading