Home » నటుడు చలపతి రావు భార్య ఎన్టీఆర్ తో ఎందుకు గొడవ పడ్డారు? అసలు కారణం ఎంతటి ?

నటుడు చలపతి రావు భార్య ఎన్టీఆర్ తో ఎందుకు గొడవ పడ్డారు? అసలు కారణం ఎంతటి ?

by Anji
Published: Last Updated on
Ad

నటుడు చలపతి రావు గురించి తెలియని వారెవ్వరు ఉండరు. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్థత్వం చలపతిరావుది. నందమూరి తారకరామారావుకి పరమ భక్తుడిగా జీవితాన్ని కొనసాగించాడు. అక్కినేని నాగచైతన్య రారండోయ్ వేడుకచూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరమా అని యాంకర్ అడిగితే.. ఆడవాళ్లు హానికరం కాదు.. కానీ పక్కలోకి పనికివస్తారు అని చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.  అయితే నటుడు చలపతిరావు భార్య ఎన్టీఆర్ తో ఎందుకు గొడవ పడ్డారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఎన్టీఆర్ స్ఫూర్తితో చలపతిరావు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  మే 08,1944న కృష్ణా జిల్లా బల్లిపర్రు గ్రామంలో జన్మించారు. ఈయనకు ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారు. వారి తండ్రి 50 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేవారు. ఇల్లంతా పాడిపంటలతో కళకళలాడుతుండేది. వీరింట్లో ఎవ్వరికీ చదువు అబ్బలేదు. ఎలాగైనా చదువుకోవాలని చలపతిరావుకి ఉండేది. తమ గ్రామంలో ఉంటే చదువుకోవడం కష్టమని భావించి తన మేనమామ ఊర్లో చదువుకున్నాడు. 10తరగతిలో ఫెయిల్ కావడంతో అక్కడ చదువుకు బ్రేక్ పడింది. తరువాత ఎలాగో అలాగా కష్టపడి 10వతరగతి పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాడు. అదే సమయంలో ఇందుమతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

 

వారి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా విజయవాడలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.  చిన్నప్పటి నుంచి చలపతిరావుకి నాటకాలు అంటే చాలా ఇష్టం. నాటకాల్లో హీరో పాత్రలే ఎక్కువగా వేసేవారు. నాటకాల్లో పేరు సంపాదించారు. సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు చలపతిరావు. మద్రాస్ బయలుదేరారు. ఆయన మద్రాస్ బయలు దేరే సమయానికి ఆయన వద్ద డబ్బులు లేకపోవడంతో తన భార్య ఇందుమతి పుస్తెలతాడు అమ్మి డబ్బులను ఇచ్చిందట. ఒకానొక సమయంలో చలపతిరావు ఎన్టీఆర్ ఇంటి వద్దకు వెళ్లి అలాగే ఉండిపోయారు. దీంతో ఆయనను గమనించిన ఎన్టీఆర్ ఎవరు అని ఆరా తీశారు. సినిమాల్లో అవకాశం కోసం వచ్చాను.. సినిమాల కోసం డిగ్రీ డిస్ కంటిన్యూ  అని చెప్పారు ఎన్టీఆర్. ఏం బ్రదర్ సినిమాల్లో అవకాశం అంటే అంత సులభం అనుకున్నారా..? బుద్దిగా ఇంటికి వెళ్లి మీ చదువును పూర్తి చేసి రమ్మనీ చెప్పాడు. అవకాశం కోసం ఎంతో ఆశగా వచ్చిన చలపతిరావుకి ఆ మాటలు వినగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

Advertisement

ఎన్టీఆర్ ఇంటినుంచి వెళ్లిపోయిన చలపతిరావు.. మళ్లీ రెండు, మూడు రోజుల తరువాత యాత్రికులతో పాటు ఇంటికి వెళ్లారు. వేలాది మందిలో కూడా చలపతిరావుని గుర్తు పట్టి ఏం బ్రదర్ వెళ్లిపోమని చెప్పాను కదా అని అడిగాడు. సినిమాల్లో నటించకుండా నేను ఇంటికి వెళ్లలేను అన్నగారు అని చెప్పాడు చలపతిరావు. దీంతో మీరు బాగా మొండివారిలా ఉన్నారే.. అని డైరెక్టర్ హేమంబర్ రావుకి చెప్పి.. మన సినిమాలో అవకాశం కల్పించాలని సూచించాడు.  ఎన్టీఆర్ నటించిన కథానాయకుడు సినిమాలో చలపతిరావుకి అవకాశం లభించింది. ఆ సినిమాలో తనకు ఇచ్చిన డైలాగ్ లు అన్నీ సింగిల్ టేక్ లో చలపతిరావు గారు చెప్పేస్తూ ఉండటంతో శభాష్ అని మెచ్చుకున్నారు ఎన్టీఆర్. చలపతిరావు గారు సినిమా అవకాశాల కోసం పడే బాధను చూసి..   చలపతిరావు గారి భార్య తట్టుకోలేక ఎన్టీఆర్ తో ఉన్న ఆత్మీయత, చనువుతనంగా ఒకసారి దగ్గరికి వెళ్లి మా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. శోభన్ బాబు కంటే కూడా అందగాడు..అయినా ఆయనకు సినిమాల్లో ఎందుకు అవకాశాలు రావడం లేదు.. మీరు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదని ఒకింత ఆగ్రహంగా, మరొకింత ప్రేమతో గొడవ పడింది. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ నటించే ప్రతీ సినిమాలో కూడా చలపతిరావుకి అవకాశం ఇచ్చారు. దీంతో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading