Home » ఈ ఆహారాలు తింటే నోటి అల్సర్లు వస్తాయట జాగ్రత్త!

ఈ ఆహారాలు తింటే నోటి అల్సర్లు వస్తాయట జాగ్రత్త!

by Anji
Ad

శీతా కాలంలో చాలా మందికి నోటి అల్సర్లు లేదా నోటి పుండ్లు రావడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చాయంటే ఏమీ తినలేం.. తాగలేం. చాలా అసౌకర్ంయగా ఉంటుంది. నోరంతా మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. నోటి అల్సర్లనే నోటి పూత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఐరన్ లోపం వల్ల, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, విటమిన్ల లోపాలు వల్ల కూడా నోటి పూత అనేది వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కూడా నోటి అల్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొన్ని రకాల నట్స్ తినడం ల్ల కూడా నోటి పూత వస్తుందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు. బాదం పప్పు, జీడి పప్పు, వాల్ నట్స్ ఇలా కొన్నింటిని తినడం వల్ల నోటి పూత ఉంటుంది. ఇందుకు కారణం కూడా ఉంది. వీటిల్లో ఆమ్లం ఎల్ ఆర్జినైన్ అనేది ఉంటుంది. ఇందు వల్ల నోట్లో గాయాలు, పుండ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. డ్రై ఫ్రూట్స్‌ని నానబెట్టుకుని తినకపోతే ఇలా నోటి పూత వస్తుంది. అందుకే నట్స్‌ని నానబెట్టి తినమంటారు.

Advertisement

ప్రతి రోజూ చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తింటే చాలా మంచిదన్న విషయం తెలుసు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టొచ్చు. మొద్దుబారిపోయిన మెదడును యాక్టీవ్ చేసుకోవచ్చు. కానీ డార్క్ చాక్లెట్ ఎక్కువగా తింటే నోటి పూత వచ్చే అవకాశం ఉంది. ఈ చాక్లెట్‌లో ఉండే బ్రోమైడ్ అనే ఆల్కలాయిడ్ కారణంగా.. నోటిలోని సున్నితమైన చర్మాన్ని చికాకు పెడుతుంది. అలాగే  బత్తాయి, నారింజ, నిమ్మ, పైనాపిల్ వంటి పుల్లని పండ్లు తినడం వల్ల కూడా నోటి అల్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి నోటిలో ఉండే సున్నితమైన కణాజాలంపై తీవ్ర ఒత్తిడిని కలుగ చేస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు వీటికి దూరంగా ఉండటం బెటర్.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading