ప్రస్తుతం చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కిడ్నీ స్టోన్స్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నీరు తక్కువగా తీసుకోవడం. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా ఎక్కువగా మాంసాహారం తినడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
కాఫీలు, టీలు తాగడం…. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం లాంటివి చేయడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్లని వాటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడే నివారించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది.
Advertisement
కాబట్టి కిడ్నీ స్టోన్స్ కరిగించే చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం…. మొక్కజొన్న కంకులకు ఉండే పొత్తును నీటిలో నానబెట్టి కొన్ని గంటల తరువాత ఆ నీటిని తాగాలి. ప్రతిరోజు ఇలా తాగితే కిడ్నీ లో రాళ్లు కరుగుతాయి. ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో అర స్పూన్ ఆలివ్ ఆయిల్ ను వేసి బాగా కలపాలి.
దానిని పరిగడుపున సేవించాలి. ఇలా కొద్ది రోజులు తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి. అదేవిధంగా ఈత కళ్ళు, తాటి కళ్ళు తాగడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్లు పడిపోయే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also read : గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా అమ్మాయిలు దేని గురించి సెర్చ్ చేస్తారో తెలుసా ? సర్వే లో ..!