సాధారణంగా సినీ రంగంలో ఒక భార్యకు మించి ఉన్న వారు చాలా మందే కనిపిస్తారు. చిత్రపరిశ్రమలో కొందరికీ రెండు, మూడు పెళ్లిలు చేసుకోవడం సాధారణం అయిపోయింది. ఈ సంప్రదాయం ఈ నాటిది కాదు.. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగిందే. రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు కొందరూ సఖ్యతగా, సంతోషంగా ఉంటే మరికొందరూ నరకప్రాయంగా ఉండేది. ఇందుకు ఉదాహరణగా మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావును తీసుకోవచ్చు.
Advertisement
ఘంటసాల మొదటి భార్య పేరు సావిత్రి. ఆమెకు ఐదుగురు సంతానం. రెండో భార్య పేరు సరళ. ఆమెకు ముగ్గురు సంతానం. ఘంటసాలకు రెండో భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడేది సావిత్రి. ఘంటసాల తన రెండో భార్యను, పిల్లలను మొదటి భార్య దగ్గరికి తీసుకురావాలని, అందరూ కలిసి మెలిసి ఉంటే చూడాలని ఆశపడేవారు. కానీ దానికి సావిత్రి ఒప్పుకునేది కాదు. ఈ విషయంలో ఘంటసాలకు ఎంతో మానసిక క్షోభను కలిగించేది సావిత్రి. ఘంటసాల రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సావిత్రినే కారణం. సరళ తమ పక్క వాటాలో నివసించే కుటుంబానికి చెందిన అమ్మాయి. సరళను ఘంటసాలకు పరిచయం చేసింది సావిత్రినే. ఎప్పుడూ ఇంటికి వస్తూ.. పోతున్న సమయంలో ఘంటసాల ఆమెకు దగ్గరయ్యారు.
Advertisement
ఇలా వీరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. ఇక తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఘంటసాలను కోరింది సరళ. అంతకు ముందు కూడా ఓ యువతి ఘంటసాలను ప్రేమించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు ఘంటసాల ఒప్పుకోకపోవడంతో ఆమె ఆ-త్మ*హ*త్య చేసుకుంది. సరళ కూడా అదే కోరుతుంది. కాదంటే ఆమె కూడా అలా చేసుకుంటుందేమోనని భయపడి ఘంటసాల పెళ్లికి ఒప్పుకున్నారు. ఘంటసాల జీవితంలోని విశేషాలను తెలుపుతూ కుమార్తె డా.శ్యామల ఆన్ లైన్ పత్రికలో సీరియల్ గా రాస్తుండగా.. దానిపై తల్లి సావిత్రి కోర్టుకెక్కడం గమనార్హం. చివరికీ శ్యామల గెలుపొందారు. ఆ తరువాత ‘నేనెరిగిన నాన్నగారు’ అనే పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!