టీమిండియా ఇంగ్లండ్ తో మొదటి టెస్ట్ లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత్ కి మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. జట్టులోంచి ఇద్దరూ కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కే.ఎల్.రాహుల్ మొదటి టెస్ట్ లో గాయపడ్డారు. వీరికి బదులుగా మళ్లీ సీనియర్లనే తీసుకుంటారని అందరూ భావించారు. కానీ అందరూ ఆశ్చర్యపోయేవిధంగా కేవలం నాలుగు టెస్ట్ లే ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లోకి ఇంకా అడుగుపెట్టని మరో ఇద్దరికీ అవకాశం కల్పించడం విశేషం.
Advertisement
ఇప్పుడు అందరి దృష్టి సర్పరాజ్ ఖాన్ పైనే పడింది. సీనియర్ ఆటగాళ్లు రహానే, చటేశ్వర్ పుజారా వంటి వారిని కాదని.. ఈ కుర్రాడి వైపు బీసీసీఐ ఎందుకు మొగ్గు చూపిందని ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ లో పృథ్వీ షా, సర్పరాజ్ ఖాన్ చాలా బాగా ఆడుతున్నారు. దీంతో సీనియర్లను కాదని కొత్త వారికే టీమిండియా పెద్ద పీట వేస్తోందని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా జట్టు ఎంపికలో బీసీసీఐ అలాగే ఆలోచిస్తోంది. సీనియర్లను కాదనేంతగా టాలెంట్ సర్పరాజ్ వద్ద ఏముంది..? అనేది చర్చనీయాంశంగా మారింది.
Advertisement
సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక టెస్ట్ లో సెంచరీ చేశాడు. అందులో 18 ఫోర్లు, 5 సిక్స్ లతో వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి శతకం బాదాడు. ఆటకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 45 మ్యాచ్ లలో 3,192 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. 11 హాఫ్ సెంచరీలున్నాయి. 2022లోనే సర్పరా్ జాతీయ జట్టుకు రావడం పక్కా అనే మాటలు వినిపించాయి. జట్టులో ఖాళీ అయిన రాహుల్ స్థానంలో ఆడాల్సిన బ్యాటర్ కి కావాల్సిన లక్షణాలు అన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ లో సర్పరాజ్ ఎలాంటి ప్రతిభ కనబరుస్తాడో వేచి చూడాలి మరీ.