Home » భారత్ కి షాక్.. ఇద్దరూ ఆటగాళ్లు ఔట్.. వారి స్థానంలో ఎవరంటే..?

భారత్ కి షాక్.. ఇద్దరూ ఆటగాళ్లు ఔట్.. వారి స్థానంలో ఎవరంటే..?

by Anji
Ad

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలిటెస్ట్ లో భారత్ ఓడిపోయిన తరువాత పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ముఖ్యంగా కీలక ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కే.ఎల్.రాహుల్ గాయాలతో రెండో టెస్ట్ కు దూరమయ్యాడు. జడేజాకు హార్మ్ స్ట్రింగ్ గాయంతో బాధపడుతుండగా.. రాహుల్ ని కుడి భుజం గాయం వేధిస్తుంది. వీరిద్దరూ రెండో టెస్ట్ లో ఆడటం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రాహుల్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులు చేస్తే.. జడేజా 87 పరుగులు చేయడంతో పాటు రెండు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు.

Advertisement

Advertisement

భారత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా కాలుకు గాయం అయింది. జోరూట్ వేసి 39వ ఓవర్ లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. పరుగు కోసం వేగంగా పరుగెత్తిన క్రమంలో జడేజాకు తొడ కండరాలు పట్టేశాయి. జడేజాతో పాటు మరోవైపు కే.ఎల్.రాహుల్ కూడా గాయపడటం ఇప్పుడు భారత్ ను తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. జడేజా, రాహుల్ ప్లేస్ ల్లో సర్ఫరాజ్ ఖాన్, సౌరబ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ లను భారత జట్టులోకి చేర్చారు. ఫిబ్రవరి 02న వైజాగ్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. ఇప్పటికే ఈ టెస్ట్ మ్యాచ్ కి కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కూడా దూరమైన విషయం తెలిసిందే.

Visitors Are Also Reading