Home » IND Vs ENG : రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs ENG : రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

by Anji
Ad

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయింది. 102.1 ఓవర్లలో 420 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ త్రుటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాల్ని కోల్పోయాడు. 196 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246, భారత్ 436కి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement

ఓవర్ నైట్ స్కోర్ 148తో క్రీజులోి వచ్చిన పోప్ నాలుగో రోజు జోరు కనబరిచారు. ఆట ప్రారంభంలోనే రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. బారత బౌలర్ల సహనాన్నిపరీక్షిస్తూ.. పరుగులు చేసాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్కోరు బోర్డును 400 దాటించాడు. టామ్ హర్ట్ లీ తో కలిసి ఎనిమిదో వికెట్ కి 80 పరుగులు జోడించి.. ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 200 దాటించాడు. అయితే హర్ట్ లీను ఆర్.అశ్విన్ బౌల్డ్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. పోప్ డబుల్ సెంచరీ కలను బుమ్రా చిదిమేశాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ  మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు 436 పరుగులు చేసింది.

Visitors Are Also Reading