Home » రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

by Anji
Ad

రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ముందుగా విధించిన గడువు ప్రకారం.. జనవరి 31 తేదీ చివరి తేదీ ఉండేది. అయితే గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో ఈ-కేవైసీ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని రేషన్ షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమివ్వడంతో అప్డేట్ చేసుకోవడానికి కొందరూ ముందుకు రాని సందర్భాలున్నాయి. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధృవీకరణ, వేలిముద్రలు సేకరిస్తున్నారు. 

Advertisement

Advertisement

రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోతే పెట్టే అవకాశం లేకపోలేదు. దీంతో మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది అనే ఆందోళనలో రేషన్ కార్డు దారుల్లో మొదలైంది. అలాంటి వారికి టెన్షన్ లేకుండా మరో నెల రోజుల పాటు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 29 వరకు ఈ-కేవైసీ చేసుకోవచ్చని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది. వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయడమే లక్ష్యంగా ఉండాలని.. కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75.76 శాతం మాత్రం రేషన్ కార్డు దారులు మాత్రమే ఈ-కేవైసీ అప్డేట్ చేసుకున్నారు.

మిగతావారు కూడా వెంటనే అప్డేట్ చేసుకొని విధంగా ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ-కేవైసీ గడువు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసేవిధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది .  మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. 

 తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading