ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని వైసీపీలో లేఖ కలకలం రేపుతుంది. నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశం పై ఎమ్మెల్యే తిప్పస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ పరిశీలకుడు అశోక్ కుమార్ కు ఎమ్మెల్యే లేఖ రాసారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేకుండా సమావేశం ఎలా జరుపుతారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న తనకు కొద్ది గంటల ముందు సమాచారం ఇచ్చారని ఎమ్మెల్యే తిప్పేస్వామి మండిపడ్డారు.
Advertisement
Advertisement
ఈ మీటింగ్ కు తాను హాజరు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తిప్పే స్వామి ఆరోపించారు. దళిత వర్గానికి ఏం సందేశం పంపించాలని అనుకున్నారో తెలియజేయాలని లేఖలో ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగించదా..? అని లేఖలో ఆయన ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే తిప్పే స్వామి రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!