సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉమెన్స్ అయినా మెన్స్ ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఆర్సీబీ జట్టు గురించి అందరికీ తెలిసిందే. వాస్తవానికి జట్టు నిండా స్టార్ ప్లేయర్లున్నా గత సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మహిళల జట్టు) కు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుకాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు ముందే భారీ షాక్ తగిలింది.
Advertisement
Advertisement
స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీలో స్టార్ ప్లేయర్‌గా ఉన్న ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ మేరకు ఆర్సీబీ శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. నైట్ స్థానంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ నదైన్ డె క్లర్క్‌ను జట్టులోకి తీసుకుంది. నైట్ఈ సీజన్ నుంచి తప్పుకోవడానికి సరైన కారణాన్ని ఆర్సీబీ వెల్లడించలేదు. అయితే మార్చిలో ఇంగ్లండ్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. మార్చి 19 నుంచి కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
డబ్ల్యూపీఎల్ – 2 వ సీజన్ ఫిబ్రవరి 23న మొదలై మార్చి 17 వరకూ సాగనుంది. కివీస్‌తో సిరీస్ మొదలయ్యేనాటికి డబ్ల్యూపీఎల్ ముగుస్తున్నా ఇంగ్లండ్ మాత్రం తమ ప్లేయర్లను ఈ లీగ్‌లో ఆడించే విషయమై తర్జనభర్జన పడుతోంది. ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు ఫ్రెష్‌గా ఉండాలని, అందుకే డబ్ల్యూపీఎల్‌లో పాల్గొని గాయాలపాలవడం, మానసికంగా అలిసిపోవడం వంటివి కాకుండా ఉండేందుకే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ క్రికెటర్లకు డబ్ల్యూపీఎల్ నుంచి తప్పుకోవాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.