దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని అనుకున్న కేసీఆర్ ఆశలకు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెక్ పెట్టాయి. తాజాగా ఏపీలో మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో పాటు రావెల కిశోర్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో చేరనున్నారు. అలాగే.. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు. జనసేనకు గుడ్‌బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరారు తోట. తోటను పార్టీకి ప్రెసిడెంట్‌గా పెట్టినా ఏపీలో బీఆర్‌ఎస్ యాక్టివిటీ కనిపించలేదు. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ను వీడాలని ఇద్దరు నేతల నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పవన్ కల్యాణ్‌ను కలవనున్నారు తోట చంద్రశేఖర్. జనసేన నుంచి గుంటూరు పశ్చిమ టికెట్ ను ఆశిస్తున్నారు తోట చంద్ర శేఖర్. మరి ఆయనకు జనసేన అడిగిన టికెట్ ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి. మరోవైపు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఈనెల 30న వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!