సాధారణంగా సెంట్రల్ బడ్జెట్ కి సమయం సమీపిస్తోంది. ఇక ఈ సారి పెద్ద బడ్జెట్ కాదనుకోండి. మధ్యంతర బడ్జెట్ అయినా కూడా సామాన్యులకు జాక్ పాట్ తగలనుందని ఏదో ఒక చిన్న ఆశ. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆ ఆశలను నిజం చేస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఈ లోపు యూనియన్ బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
వాస్తవానికి తొలి ప్రధాని పంటిడ్ జవహర్ లాల్ నెహ్రు ప్రధాని హోదాలో తొలిసారిగా 1958-59 సంవత్సరానికి బడ్జెట్ సమర్పించారు. సాధారణంగా దేశ ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సమర్పిస్తారు. అయితే పండిట్ నెహ్రు కాకుండా ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో 1970-71 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను సమర్పించారు. దేశంలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి మహిళా కూడా ఇందిరా గాంధీ కావడం విశేషం. అలాగే ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ కూడా ప్రధాని హోదాలో 1987-88 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు.
Advertisement
- దేశ బడ్జెట్‌ను అత్యధిక సార్లు సమర్పించిన ఘనత మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌కే దక్కుతుంది. బడ్జెట్‌ను ఆయన మొత్తం 10 సార్లు సమర్పించారు. ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం 9 సార్లు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- 1973-74 సంవత్సరపు బడ్జెట్‌ను దేశంలోని ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలుస్తారు. దీన్ని అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌రావు చవాన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రూ.550 కోట్ల లోటు ఏర్పడింది. అప్పటి వరకు ఇదే అతిపెద్ద లోటు బడ్జెట్. ఈ బడ్జెట్ 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం, పేలవమైన రుతుపవనాల వల్ల ప్రభావితమైంది.
- 2000-01 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సమర్పించారు. దీనిని దేశ ‘మిలీనియం బడ్జెట్’గా పిలుస్తారు. ఇది 21వ శతాబ్దపు తొలి బడ్జెట్. ఈ బడ్జెట్లో చేసిన ప్రకటనలు దేశంలోని ఐటీ రంగంలో విప్లవానికి దారితీశాయి.