రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ సమయంలో ఓ కన్నడ స్టార్ హీరో ఆకస్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి భయపడేది లేదన్నాడు. దీంతో అతను ఎవరు అబ్బా అని తెలుగు ప్రేక్షకులందరూ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా అతను హీరోగా నటించిన కాటేరా సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. అది కూడా ఓ హీరోయిన్ వల్లనే. దీనికి ఒక్క వీడియోనే కారణం అని తెలుస్తోంది.
Advertisement
కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఇతడిని అభిమానులు డి-బాస్ అని పిలుస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఓ అనవసరమైన కామెంట్స్ చేస్తూ.. వివాదాల్లో ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి సంసారంలో చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. ఇదంత కూడా పవిత్ర గౌడ అనే హీరోయిన్.. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేయడంతోనే వచ్చింది. 10 ఏళ్ల రిలేషన్ షిప్ ఇది. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ దర్శన్ అని వీడియో దిగువన క్యాప్షన్ పెట్టింది. చాన్నాళ్ల నుంచి దర్శన్-పవిత్ర గౌడ మధ్య ఏదో ఉందని కన్నడ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.
Advertisement
తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో దర్శన్ తో పవిత్ర గౌడ.. సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి మరింత సీరియస్ అయిందట. ఏకంగా సెట్ కి వెళ్లి మరీ పవిత్ర గౌడకు వార్నింగ్ ఇచ్చిందట. ఇకపై దర్శన్ తో కనిపించొద్దని పవిత్ర గౌడకు గట్టిగానే విజయలక్ష్మీ చెప్పిందట. ప్రస్తుత ఈ విసయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయం పై అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని పవిత్రని దర్శన్ భార్య హెచ్చరించిందట. ఇందులో వాస్తవం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!