అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత నీకోసం సినిమా ద్వారా సోలో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. భారీ పాపులారిటీ దక్కించుకున్నారు మాస్ మహారాజా రవితేజ..తనదైన అద్భుతమైన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగిపోయారు. రవితేజ తన సినిమాలతో మాస్ మహారాజాగా పేరు దక్కించుకొని.. ఒకవైపు పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే వేగంగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన రెమ్యునరేషన్ అలాగే ఆస్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
రవితేజ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ఆరంభంలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న రవితేజ.. క్రాక్ సినిమా ముందు వరకు రూ.12 కోట్ల వరకు పారితోషకం తీసుకునేవారు. దీని తర్వాత రూ.15 కోట్లకు పెంచారని సమాచారం. అలా ధమాకా హిట్ తర్వాత ఏకంగా రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల పారితోషికం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ కంటే కూడా ఈ పారితోషకం ఎక్కువ అని చెప్పవచ్చు.
Advertisement
మరి రవితేజ ఆస్తుల విషయానికొస్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజకు రూ .150 కోట్ల నికర ఆస్తుల విలువ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈయనకు హైదరాబాద్ తో సహా మరికొన్ని ప్రాంతాలలో రూ.30 కోట్ల విలువ చేసే ఇళ్ళు కూడా ఉన్నాయట. అలాగే రూ .6 కోట్ల విలువైన కార్లు, రూ .2కోట్ల విలువైన యాక్ససరీస్ తోపాటు రూ .50 కోట్ల విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు వీటిల్లో సగానికి పైగా ఆయన భార్య పేరు మీద రాసినట్లు తెలుస్తోంది.