కోలీవుడ్ నటి ఖుష్బూ సుందర్ తెలుగు సినీ ప్రేక్షులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగపాండవులు అనే మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్ అయింది. ఇక ఆ తరువాత తమిళంలో వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎధిగారు.
Advertisement
దాదాపు తమిళ స్టార్స్ అందరితో ఖుష్బూ కలిసి నటించారు. గత ఏడాది గోపిచంద్ నటించిన రామబాణం సినిమాలో కనిపించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఖుష్బూ.. చాలా అరుదుగా సినిమాల్లో కనిపిస్తున్నారు. నటుడు సుందర్ ను పెళ్లాడిన ఖుష్బూకు అవంతిక, ఆనందిత ఇద్దరూ కుమార్తెలున్నారు. తాజాగా తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఖుష్బూ ట్వీట్ చేసింది. తన చిన్నారి తల్లికి అప్పుడే 21 ఏళ్లు నిండాయా అంటూ భావోద్వేగానికి లోనైంది.
Advertisement
My baby. My adorable little one. All of 21 today. You grew up suddenly. From a little cutie button to literally towering over me, you have not given me a single sleepless night. You have been an angle. Your smile, your eyes, your dimple, your hug, your sweet nothings, all are so… pic.twitter.com/cAU0yvqHG7
— KhushbuSundar (@khushsundar) January 25, 2024
నీ అందం, చిరునవ్వు చూస్తే చాలు ఎంతో ఆనందంగా ఉంటుందని రాసుకొచ్చారు. నువ్వు నా కడుపులో పెరిగిన రోజు నుంచి.. ఇప్పటివరకు నీపై ్రేమ తగ్గలేదని ట్వీట్ చేశారు. లవ్ యూ మై బొమ్మై అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఖుష్బూ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన నటి కూతురు అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.