తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాల్లో అర్హత గల వారికి కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 06, 2024 వరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీలతో పాటు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Advertisement
కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టర్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు దారుల కోసం ఫిబ్రవరి నెలాఖరు వరకు అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజా పాలనలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవా ద్వారా అప్లై చేయవచ్చు. అభయ హస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారున్నారు.
Advertisement
కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో పేరు లేని వారు, మార్పులు, చేర్పుల కోసం కూడా మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్మర్మేటిక్ సెంటర్ ప్రత్యేక సాప్ట్ వేర్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోవడానికి జనవరి 31లోపు తుది గడువుగా ఉంది. రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!