Home » పరుచూరి చెప్పినా వినకుండా చిరంజీవి నటించిన ఆ ఫ్లాప్ సినిమా ఏంటో తెలుసా ?

పరుచూరి చెప్పినా వినకుండా చిరంజీవి నటించిన ఆ ఫ్లాప్ సినిమా ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే అభిమానులు అర్థరాత్రి నుంచే టికెట్ల కోసం లైన్ లో నిలుచునే వారు. అప్పట్లో చిరంజీవి సినిమా చూసేందుకు టికెట్ల కోసం ఎంత శ్రమించే వారో తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి అంటే అభిమానులకు గుర్తుకు వచ్చేది మాస్ డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా ఒప్పుకోరు.  ఇవి లేకుండా  సినిమా కోసం చిరంజీవి ప్రాణం పెట్టి పని చేసినా దానిని పట్టించుకోకుండా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చేస్తారు. అలా ఫ్లాప్ అయిన ఓ సినిమా శంకర్ దాదా జిందాబాద్.

paruchuri-brothers

Advertisement

 

చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎంబీబీఎస్ 2005లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బాలీవుడ్ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తన మార్క్ కామెడీ అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తో ఆడియన్స్ ని అలరించారు. 2007లో ఈ సినిమాకి సీక్వెల్ గా హిందీలో మున్నాబాయ్ జిందాబాద్ కి రీమేక్ కి తెరకెక్కిన శంకర్ దాదా జిందాబాద్.. గాంధీగిరి అంటూ అహింస అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో మాస్ హీరో ఇమేజ్ ఉన్న చిరంజీవితో శాంతి వచనాలు చెప్పించడమే కాకుండా.. చిరంజీవిని ఒక మానసిక రోగిగా చూపించారు.

Advertisement

ఈ సినిమాలోని పాయింట్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమాని చేయవద్దని పరిచూరి గోపాల  కృష్ణ ముందుగానే చిరంజీవికి సలహా ఇచ్చారట. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్ గా పని చేశారు.  సినిమా స్టార్టింగ్ లోనే పరుచూరి చిరంజీవితో సినిమా వద్దని చెప్పారట. మీ బాడీ లాంగ్వేజ్ కి ఈ కథ అంతగా సెట్ కాదని.. మాస్ డైలాగ్స్ చెప్పే మీరు శాంతి వచనాలు చెబుతుంటే ఆడియన్స్ అంగీకరించలేరని చెప్పారట. కానీ చిరంజీవి వాటిని పట్టించుకోకుండా సినిమా చేశారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading