బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంపై సెన్షేషన్ కామెంట్స్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మరి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలంతా మాజీ మంత్రి హరీష్ రావుకి తెలిసే కలిశారని ఆరోపించారు. కర్మ సిద్ధాంతంను నమ్ముతానని, మీరేం చేశారో తిరిగి మీకు అదే జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Advertisement
గతంలో ప్రతిపక్షాల పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా ప్రవర్తించారు అనేది సమాజం చూసిందన్న రఘునందన్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా అలానే జరుగుతుందన్నారు రఘునందన్ రావు. ఫామ్ హౌస్ లోని కేసిఆర్‌ను ఆయన కూతురు కవిత కలిసి మెదక్ ఎంపీగా పోటీ చేస్తానని ఒత్తిడి తెచ్చారని, కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, నలుగురు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించినట్లు రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.
Advertisement
గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు కూడా పూల బొకే ఇచ్చి కలిశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి నలుగురు ఎమ్మెల్యేల లాగానే హరీష్ రావు కూడా అప్పుడు తెల్లరి ప్రెస్ మీట్ పెట్టాడన్నారు. ప్రజల తిరస్కరణ తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీలో జ్ఞానం రాలేదన్నారు రఘునందన్. ఇక ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్న వీరికి గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ప్రోటోకాల్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి అసలు ప్రోటోకాల్ అంటే ఎంటో తెలుసా అని ప్రశ్నించారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!