సాధారణం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ తప్పని సరిగా మారింది. ఇక టెలికాం సంస్థలు కూడా వినియోదారుల అవసరాలకు తగ్గట్లు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ.. ఆకర్షిస్తున్నాయి. అలాగే టెలికాం రంగంలో 2జీ,3జీ,4జీ సేవలు అనేవి ఉండేవి. 2022 అక్టోబర్ లో భారత్ లో 5 జీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. దేశంలో టాప్ 2 టెలికాం ఆపరేటర్లుగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మాత్రమే తమ వినియోగదారులకు 5జీ సేవలను అందిస్తున్నాయి. కొన్ని ప్లాన్లపై అన్ లిమిటెడ్ 5జీ డేటాను కూడా సదరు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే తాజాగా 5జీ యూజర్లకు ఎయిర్ టెల్, జియో షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి.
Advertisement
Advertisement
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు 2022 అక్టోబర్ నుంచి భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే . ప్రస్తుత 4 జీ రేట్లతోనే అన్ లిమిటేడ్ 5జీ సేవలను కూడా అందిస్తున్నాయి. అయితే ఈ 2024 ద్వితీయార్థం నుంచి ఆ సేవలకు ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉన్నాయంట. 4జీతో పోల్చుకుంటే 5 నుంచి 10 శాతం అధిక ధరతో 5జీ టారిఫ్‌ను వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కొన్ని ప్లాన్లపై అన్ లిమిటెడ్ 5జీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లోని యూజర్లకు మాత్రమే దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఉచితంగా అదనపు డేటాను ఆస్వాదిస్తున్నారు. 5జీ వినియోగదారులు పెరుగుతున్న తరుణంలో రేట్లు పెంచి ప్రయోజనం పొందాలని ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.