సాధారణంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితం అని ప్రతీ ఆర్టీసీ బస్సులో రాసి ఉంటుంది. కానీ అలాంటి ఆర్టీసీ బస్సులోనే ఓ ప్రయాణికుడు పావు గంట సేపు నరక యాతన అనుభవించాడు. ఆర్టీసీ బస్సు కిటికీలో ఓ ప్రయాణికుడి తల ఇరుక్కు పోయిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. అంతే తిరిగి తలను లోపలకు తీసుకునేందుకు ప్రయత్నించగా మెడ నుంచి పై భాగం లోపలికి రాకుండా అక్కడే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ తల మాత్రం లోపలకు రాలేదు. దాదాపు 15 నిమిషాలు అవస్థలు పడుతుండడంతో గుర్తించిన డ్రైవర్ బస్సును టెక్కలిలో ఆపి కిటికీలో ఇరుక్కున్న ప్రయాణికుడి తలను సురక్షితంగా తీసేందుకు స్థానికుల సహాయంతో ప్రయత్నాలు చేశారు.
Advertisement
చివరకు బస్సు లోపల నుండి కొందరూ.. బయట నుండి కొందరు గట్టిగా తలను అదిమి పట్టుకొని బలవంతంగా లాగగా ఎట్టకేలకు ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి బస్సు కిటికీలో తల ఇరుక్కు పోయి 15నిమిషాల పాటు హడావిడి జరగటంతో అందరి నోట ఇదే చర్చ జరగడం గమనార్హం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!