మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ.. మెగాస్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం యువ హీరోలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అయితే చిరంజీవి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారి వద్ద ఎన్నో విషయాలను నేర్చుకున్నారట. ఇటీవలే విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Advertisement
ఎన్నో గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూర దృష్టితో రామారావు గారితో తాను చేసిన సినిమా తిరుగులేని మనిషి. ఈ సినిమాలో ఎన్టీఆర్, చిరంజీవి కలిసి కిందికి దూకే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ చేస్తున్న సమయంలో చిరంజీవి చేతులు ఊపి కిందికి దూకేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం దూకకుండా అలాగే ఉన్నాడు.
Advertisement
బ్రదర్ అలా దూకకూడదు అని చెప్పారు ఎన్టీఆర్. సినిమా ఆర్టిస్ట్ జీవితం చాలా విలువైనది. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే.. సినిమాకు చాలా నష్టం కలుగుతుంది అని చెప్పాడు. ఆ సినిమా తరువాత సంఘర్షణ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో కొండల్లో చిరంజీవి, విలన్ కి ఫైటింగ్ జరుగుతుంది.
ఈ ఫైటింగ్ జరిగే సమయంలో చిరంజీవి విలన్ తన్నే క్రమంలో కాలు బెనికింది. చాలా ఇబ్బంది పడ్డాడట. దాదాపు 6 నెలల వరకు షూటింగ్ కి హాజరు కాలేదు. అందుకే మనం పెద్దల మాట వినాలి. చాలా దూర దృష్టితో ఎన్టీఆర్ గారు సూచనలు ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే చెప్పుకొచ్చారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!