పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య సానియా మీర్జాకి దూరంగా ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేమ కోసం దేశాన్ని విడిచి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని వచ్చిన టెన్నీస్ స్టార్ సానియా మీర్జాను ఎలా మోసం చేయాలనిపించిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. 2010లో షోయబ్ మాలిక్ సానియామీర్జను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే మాలిక్ రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల తరువాత సానియాను పెళ్లి చేసుకున్నాడు.
Advertisement
Advertisement
తాజాగా పాకిస్తాన్ ప్రముఖ నటి సనా జావేద్ ను మాలికి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి సానియా-మాలిక్ విడిపోతున్నారని రెండేళ్ల కిందటే వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని రూమర్స్ గా కొట్టిపారేశారు. తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్ తో వీరు విడిపోతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దానిని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి అని సానియా సోషల్ మీడియాలో ఓ కొటేషన్ రాసింది.
దీంతో వారిద్దరూ విడిపోతున్నట్టు వార్తలు మొదలయ్యాయి. సానియా తన భర్త ఫొటో లేకుండానే ఫొటోలను షేర్ చేస్తోంది. మరోవైపు సనా జావేద్ కి ఇది రెండో వివాహం. పాకిస్తాన్ కి చెందిన ఈ నటి ఏ ముష్త్ ఏ ఖాన్, డంక్ అనే షోలతో ఆమెకు గుర్తింపు లభించింది. 2020లో ఉమర్ జస్వాల్ ను పెళ్లి చేసుకుంది. కొద్ది కాలానికే విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి మాలిక్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వినిపించాయి. ప్రధానంగా సనా పుట్టిన రోజున మాలిక్ శుభాకాంక్షలు చెప్పినప్పటి నుంచి వార్తలు ప్రారంభం అయ్యాయి.