Home » ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన రామ్ లల్లా.. విశిష్టతలు ఇవే..!

ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన రామ్ లల్లా.. విశిష్టతలు ఇవే..!

by Anji
Ad

అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్య మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరాముడిని గర్భగుడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం బాలరాముడు విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

రామ్ లల్లా  విశిష్టతలు : 

  • అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
  • నల్లరాయి  నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్ కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
  • రామ్ లల్లాను చెక్కిన శిల యొక్క బరువు దాదాపు 200 కిలోలు.
  •  విగ్రహం యొక్క బరువు 150 కిలోలు.
  • కాశీకి చెందిన  జ్ఞానేశ్వర్ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట పూజలు
  • గర్భాలయంలో నిలుచున్న రూపంలోనే రామ్ లల్లా దర్శనమిస్తాడు.
  • విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈనెల 22న సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది.
  • శ్రీరామ నవమి రోజు గర్భగుడిలో సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు.

Advertisement

ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మహంత్ నృత్య గోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు గర్భగృహం అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. అయితే ప్రాణప్రతిష్టకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన యజమానిగా వ్యవహరిస్తారు. ఇక ఈనెల 23 నుంచి గర్భాలయంలో బాల రాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. 

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading