ప్రొ కబడ్డీ 10వ సీజన్ హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా లీగ్ ప్రచారకర్త.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి తెలుగు టైటాన్స్ – బెంగళూరు బుల్స్ మ్యాచ్ కి బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలగొట్టి క్రీడాకారులను, అభిమానులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ క్రికెట్ తరువాత కబడ్డీ ప్రాచుర్యం పొందిందన్నారు. తనకు క్రీడలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
Advertisement
Advertisement
తన కారులో ఎప్పుడూ క్రికెట్ కిట్ ఉంటుందని.. సమయం దొరికితే క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఎక్కువగా ఆడతానని చెప్పారు. ప్రొ కబడ్డీ చూస్తుంటే తనకు పాఠశాల, కళాశాల రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. మరోవైపు తెలుగు టైటాన్స్ కథ మాత్రం మారలేదు. బెంగళూరు బుల్స్ చేతిలో 26-42తో ఓడిపోయింది. తొలి అర్థభాగం 12-9 తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్.. బ్రేక్ తరువాత చాలా వెనుకపడిపోయింది. టైటాన్స్ ని ఆలౌట్ చేయడంతో పాటు డిఫెన్స్ లో కూడా అదరగొట్టిన బెంగళూరు చాలా తేలికగా విజయాన్ని అందుకుంది.
సుర్జీత్ సింగ్ (7), వికాశ్ ఖండోలా(6) బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. టౌటాన్స్ తరపున పవన్ సెహ్రావత్ (7) ఎప్పటి మాదిరిగానే ఒంటరిగా పోరాటం చేశాడు. 13 మ్యాచ్ ల్లో టైటాన్స్ కి ఇది 12వ ఓటమి కావడం గమనార్హం.