సాధారణంగా వెల్లుల్లిని మనం నిత్యవసర వస్తువుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏ వంటలో అయినా వెలుల్లి ఉండాల్సిందే. వెల్లుల్లితో వచ్చే రుచి అంతా ఇంతా కాదు. అందుకే ఫ్రైడ్ రైస్‌లు, స్టాటర్స్‌లో సైతం వెల్లుల్లిని యాడ్ చేస్తారు. వెల్లుల్లితో వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చలి కాలంలో వెల్లుల్లితో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యాధులు దరి చేరకుండా చూడస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సీజన్‌లో వెల్లుల్లి ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
చైనీయుల అధ్యయనం ప్రకారం.. వారానికి ఒక్కసారి అయినా వెల్లుల్లి తింటే.. ఎక్కువ కాలం జీవిస్తారని తేలించింది. వెల్లుల్లి వృద్ధ్యాప్య లక్షణాలను తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంది. అంతే కాకుండా తక్షణమే శరీరంలో శక్తిని పెంచుతుంది.
Advertisement
శీతా కాలంలో కాల్చిన వెల్లుల్లి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది పొట్టుతో కాల్చుతారు. అలా కాకుండా.. పొట్టు తీసి దానిపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి.. ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. తక్కువ మంట మీద డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒకటి నుంచి రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే సరిపోతుంది.
ఇలా కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. శీతా కాలంలో వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ, నీరసం, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి అనేది ఉండాలి. ఇది వైరస్, బ్యాక్టీరియా బారి నుంచి కాపాడుతుంది.
వెల్లుల్లి తింటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ హైపర్లిపిడెమియా ప్రభావాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.