Home » హీరోయిన్ ఆమని భర్త ఎవరు..? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ..?

హీరోయిన్ ఆమని భర్త ఎవరు..? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ..?

by Anji
Ad

Aamani Husband and Family Details: సహజమైన అందంతో,  అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకొని సగటు ఇల్లాలు పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మదిలో నిలిచిన హీరోయిన్ ఆమని. ఒకప్పుడు హీరోయిన్ గా చాలా మంచి పాత్రల్లో నటించేది. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ.. అటు బుల్లి తెర మీద కూడా సందడి చేస్తోంది.  ఈ మధ్య కాలంలో ఎంసీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది.  బుల్లితెర మీద రియాలిటీ షోకి అప్పుడప్పుడూ జడ్జీ గా వ్యవహరిస్తూ.. సీరియల్స్ లో కూడా నటిస్తోంది.

Amani-husband-and-Family-Details

Advertisement

 

ఆమని తన కెరీర్ లో అప్పుడప్పుడూ వ్యక్తి గత విషయాలను పంచుకుంటుంది. ఈ తరుణంలోనే మీడియా ముందుకు వచ్చిన ఆమని తన భర్త ఎవరు ? ఏం చేస్తుంటారు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే ఆసక్తికర విషయాలను పంచుకుంది. హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న సమయంలో 1990లో పెళ్లి చేసుకున్న ఆమని.. ఆ తరువాత సినీ కెరీర్ లో వెనుకబడి పోయింది. ఇప్పుడిప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతున్న ఆమనికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువనే. ఈమె శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తురాలు.

Advertisement

ఆమని ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఖాజా మొహీద్దున్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమని.. తన భర్త సినిమా నిర్మాత అని తెలిపింది. కన్నడ సినిమా చేేసే సమయంలో తాను చేసిన సినిమాను ఆయన నిర్మించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. ఆ స్నేహం పెళ్లి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చింది. ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు. వీరిలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.   ప్రస్తుతం తన తల్లితో.. పిల్లలతో వేరుగా ఉంటున్నట్టు వివరించారు ఆమని.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading