Home » తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకం అమలు.. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌

తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకం అమలు.. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేక పోర్టల్‌

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా కాంగ్రెస్  ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేయగా.. మరో నాలుగు హామీలను నెరవేర్చేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల వేళ 200 యూనిట్ల  వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పవర్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమావేశాలు నిర్వహించగా ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌  తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకం అమలుకోసం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో తెలంగాణలోనూ కొత్త పోర్టల్ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. ఇక ప్రత్యేక పోర్టల్‌ పేరు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించనుండగా.. ఉచిత విద్యుత్ కావాలంటే ఈ పోర్టల్ లో సర్వీస్‌ నెంబర్‌తో తదితర వివరాలు మెన్సన్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

 

అదేవిధంగా రాష్ట్రంలో కోటి 31లక్షల 48 వేల గృహావసర విద్యుత్తు కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తుండగా.. 200 యూనిట్ల లోపు వాడుతున్న కనెక్షన్ల సంఖ్య కోటి 5లక్షలు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రతి నెలా కరెంట్‌ బిల్లులపై డిస్కంలకు రూ.350 కోట్ల ఆదాయం వస్తుండగా.. ప్రభుత్వం ఉచిత కరెంట్‌ పథకం అమలు చేస్తే ఏడాదికి సర్కార్‌పై రూ.4,200 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఇక ఇటీవలే ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గృహలక్ష్మి పథకం అమలుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading