భారత కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో టీ-20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. బెంగళూరులో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం ఐదు టీ20 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Advertisement
Advertisement
ముఖ్యంగా నాలుగు అంతర్జాతీయ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్‌ల కంటే రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. జనవరి 2019 తర్వాత రోహిత్ శర్మ మొత్తం T20 క్రికెట్లో మొదటి సెంచరీ చేయడం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో సెంచరీ సాధించాడు. టీ20లో 5వ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్‌తో పాటు రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేశాడు. రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. భారత్ నిర్దేశించిన టార్గెట్ ను అప్గానిస్తాన్ ఛేదిస్తుందో లేక చతికిల పడుతుందో వేచి చూడాలి మరీ.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!