గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున రెండు ఎమ్మెల్సీ భర్తీపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. హైకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement
గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కొరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావుల పేర్లను గవర్నర్ కు పంపింది. వారి ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. గవర్నర్ కోటాలో రాజకీయ నాయకులను నియమించలేమని తమిళి సై స్పష్టం చేసింది. అప్పట్లో గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారాన్ని రేపింది. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో గత సీఎం కేసీఆర్ కి ఝలక్ ఇచ్చినట్టే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా గవర్నర్ తమిళి సై ఝలక్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ గవర్నర్ తమిళి సై తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. అలాగే కోర్టు తీర్పు ఎప్పుడుంటుందో వేచి చూడాలి మరీ.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి!