బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హొసేన్ కి అంతర్జాతీయ క్రికెట్ మండలి భారీ షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా అతనిపై నిషేదం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని అల్లంఘించినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంతర్జాతయ క్రికెట్ మండలి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ-10 లీగ్ లో 2020-21 సీజన్ కి గాను పుణే డెవిల్స్ కి ప్రాతినిథ్యం వహించిన నాసిర్ హుసేన్ మరో ఏడుగురితో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సెప్టెంబర్, 2023లో అభియోగాలు నమోదు చేసింది.
Advertisement
Advertisement
ఈ అంశంపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా నాసిర్ హుసేన్ తప్పు చేసినట్టు తేలింది. ఖరీదు అయిన ఐపోన్ 12న బహుమతిగా పొందడం సహా ఫిక్సింగ్ కు సంబంధించి ఆ ఫోన్ లో బూకీలతో మాట్లాడటం.. ఈ విషయాల గురించి ఏ దశలోనూ అవినీతి నిరోధక విభాగంతో సంప్రదించకపోవడం.. విచారణలో సహకరించకపోవడం అతనిపై వేటుకు కారణం అయింది. తాజా నిషేదంతో మళ్లీ 2025 ఏప్రిల్ 07 తరువాతనే నాసిర్ హుసేన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. స్పిన్ ఆల్ రౌండర్ నాసిర్ హుసెన్ బంగ్లాదేశ్ తరపున 19 టెస్ట్ మ్యాచ్ లు.. 65 వన్డేలు, 31 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. చివరి సారిగా 2018లొ బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!