ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మరో అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుకు 2023 వరల్డ్ కప్ అందించి తన పేరును క్రికెట్ చరిత్రలో లిఖించుకున్న ఆయన.. ఇప్పుడు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు తీసిన కమిన్స్.. టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్ చేయడంలోనూ కీలకపాత్ర పోషించిన బౌలర్.. 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా నిలిచాడు.
Advertisement
Advertisement
తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)ను వెనక్కినెట్టి కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. ఈ అవార్డు కోసం నలుగురు పేర్లు పరిగనలోకి తీసుకోగా చివరికి కమిన్స్ ను అవార్డు వరించింది. విరాట్ కోహ్లీ (భారత్), రవీంద్ర జడేజా (భారత్), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)ఒక క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఫార్మాట్లలో ప్రభావాన్ని చూపిన ఆటగాడికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇది క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగత అవార్డుగా పరిగణించబడుతుంది. 2004లో క్యాలెండర్ ఇయర్ లో తొలిసారిగా ఈ అవార్డును అందించగా రాహుల్ ద్రవిడ్ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకూ విరాట్ కోహ్లీ (2017, 2018), మిచెల్ జాన్సన్ (2009, 2014), రికీ పాంటింగ్ (2006, 2007) మాత్రమే క్రికెట్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ అవార్డు అందుకున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!