టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా గుంటూరు కారం మూవీతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ అభిమాని ఆ సినిమా గురించి మహేష్ బాబుకి బహిరంగంగా ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ వైరల్ అవుతోంది. అందులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
అతడు పోకిరి వంటి సినిమాలు వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా.. నువ్వు చైర్ లో కూర్చుని స్థాయిలో నువ్వు మాట్లాడే స్టైల్ ని అనుసరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారనే విషయం నీకు తెలుసా.. తెలియదా అన్న.. ఐ యాం సారీ నువ్వు సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశావు నానే సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ కాలానికి ఏ హీరో చేయని సాహసం.. టక్కరి దొంగ వన్ నేనొక్కడినే స్పైడర్ ఖలేజా వంటి ఇలా ఎన్నో ప్రయోగాలు చేశావు హిట్స్ ప్లాప్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలను ఇప్పటికే నేను ఇష్టపడుతుంటా.. ఇక బ్రహ్మోత్సవం గురించి అయితే నేను చెప్పలేను ఈరోజు వరకు నేను చూడని సినిమా అది మళ్లీ ఇన్నేళ్లకు గుంటూరుకు హారం కూడా ఆ లిస్టులో చేరింది.. ప్రామిస్ చెబుతున్న ఇంకా నేను గుంటూరు కారం సినిమా చూడను చూసి బాధపడలేను అందరూ హీరోలు ఈ కాలానికి తగ్గట్టు సినిమాలు చేస్తున్న నువ్వెందుకు అన్న ఇంకా అలాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాలే చేస్తున్నావు.
Advertisement
ఓపెన్ గా చెబుతున్నా.. శ్రీమంతుడు భారత్ అనే నేను ఆ మధ్య ఇంకోటి ఏదో వచ్చింది ఆ గుర్తొచ్చింది సర్కారు వారి పాట సినిమా ఈ మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోల్చుకోలేని విధంగా టీవీలో వచ్చినప్పుడు పేర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను ప్రపంచంలో ఎక్కడన్నా నాలుగు సినిమాలు సేమ్ ఉంటాయన్న. త్రివిక్రమ్ బోయపాటి ఈ బ్లా బ్లా లాంటి సో కాల్ డైరెక్టర్లు ఒక వర్గం హీరోలకు మాత్రమే హెచ్చిస్తున్నారు ఇది గమనించన్నా ప్లీజ్.. అంత టాలెంట్ పెట్టుకొని ఇలాంటి కథలు ఇలాంటి స్క్రీన్ ప్లే మనకెందుకు అన్న ప్రశాంత్ నీలో ప్రశాంత్ వర్మ ఇలాంటి కొత్తోల్లకు అవకాశాలు ఇవ్వు అన్న. దిక్కుమాలిన అవుట్ డేటెడ్ దర్శకత్వం ఇక సినిమాలు వద్దు ఈ తరానికి నీకు తగ్గకథలు మాకు చెప్పు వినడానికి బ్రేక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ఓ అభిమాని బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!