Home » ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 12 సినిమాలు..హనుమాన్ కాకుండా ఆ 11 మంది సూపర్ హీరోలు వారేనా..?

ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 12 సినిమాలు..హనుమాన్ కాకుండా ఆ 11 మంది సూపర్ హీరోలు వారేనా..?

by Anji
Ad

 తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ఇప్పటివరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా హనుమాన్ మూవీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రశాంత్ వర్మ పేరు మారు మ్రోగిపోతుంది. తొలి సినిమా అ! మూవీతోనే టాలెంట్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. కానీ అప్పట్లో అంత ఫేమస్ కాలేదు. ఆ తరువాత కల్కి, జాంబీరెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు, పాపులారిటీ దక్కించుకున్నాడు. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన మొదటి సినిమా. ప్రశాంత్ వర్మ హనుమాన్ తో సహా తన యూనివర్స్ మొత్తం 12 సూపర్ హీరోల సినిమాలు రానున్నట్టు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ సూపర్ హీరోలు ఎవరు ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

సూపర్ హీరో కథాంశంతో తన యూనివర్స్ లో 12 సినిమాలు రాబోతున్నాయని తెలిపారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం హనుమాన్ మవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సామాన్యుడికి హనుమంతుడి శక్తులు వస్తే.. ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కాకుండా మరో 11 మంది సూపర్ హీరోలు తన యూనివర్స్ లో ఉండనున్నారు. హనుమాన్ మూవీ తరువాత అధీర మూవీని తెరకెక్కించనున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఈ సినిమాకి నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో దేవతల రాజు ఇంద్రుడు పవర్స్ ను చూపించనున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో హిందూ గాడ్స్ ని సూపర్ హీరోస్ గా అందరికీ పరిచయం చేయనున్నారు. ఈ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.  ఈ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేచి చూడాలి మరీ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading