Home » రామ భక్తులకు శుభవార్త…ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు

రామ భక్తులకు శుభవార్త…ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు

by Anji
Ad

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్య చేరుకోవడానికి అనేక రకాల సౌకర్యాలకు సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో జనవరి 15 నుంచి ముంబై-అయోధ్య  మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించనుంది. సోమవారం నుంచి రెండు నగరాల మధ్య నేరుగా రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ విమానం ముంబై నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి 2:45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అయోధ్య నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:40 గంటలకు ముంబై చేరుకుంటుంది.

Advertisement

Advertisement

అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో స్పైస్ జెట్  ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వారంలో మూడు రోజుల పాటు విమానాలు నడిపేందుకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. టికెట్ల బుకింగ్స్ కూడా షురూ అయ్యాయి. జనవరి 22 తర్వాత నుంచి సామాన్య భక్తులక దర్శనం కల్పించనున్న సంగతి తెలిసిందే. అయితే అయోధ్యకు చేరుకునేందుకు ఎక్కువగా దక్షిణ భారతం నుంచి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రామేశ్వరం, అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలు కావడంతో పర్యాటకులకు ఎంతో సౌలభ్యం కలగనుంది.

 

బెంగుళూరు నుంచి వచ్చే నెల 1 నుంచి బెంగళూరు-వారణాసి మధ్య సైస్ జెట్ విమానాలను నడపనుంది. బెంగళూరు నుంచి ఉదయం 10.50 గంటల బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1.30గంటలకు బబత్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2.10గంటలకు బబత్ పూర్ లో బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు బెంగుళూరుకు చేరుతుంది. మంగళవారం, గురువారం, శనివారంలో ఈ విమానం నడుస్తుందని స్పైస్ జెట్ అధికారులు తెలిపారు.

Visitors Are Also Reading