Home » సంక్రాంతికి మిగిలిన పండుగలకు మధ్య తేడా ఏంటో తెలుసా ?

సంక్రాంతికి మిగిలిన పండుగలకు మధ్య తేడా ఏంటో తెలుసా ?

by Anji
Ad

సంక్రాంతి… మిగిలిన పండుగల్లా ఒకే తిథినాడు రాదు. సూర్యుడి సంచారాన్ని బట్టి జరుపుకొంటారు కాబట్టి, ఇలా జరుగుతుంది. సూర్యుడు ఆరు నెలలపాటు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణానికి ప్రయాణమవుతాడు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ఇది సాధారణంగా మార్గశిరంలోగాని, పుష్యమాసంలో గాని వస్తుంది. సంక్రాంతి రోజు ప్రజలు పితృదేవతలకు తిలోదకాలు విడుస్తారు. నువ్వుల పిండితో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుము. ఈ రోజుల్లో ఇంటి ముందు అలికి, రంగురంగుల ముగ్గులు పెడతారు. వాటి మధ్యలో ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి, రకరకాల పూలతో అలంకరిస్తారు. వాటి పక్కనే నువ్వులు, బియ్యం, రేగు పండ్లను కూడా పెడతారు. ప్రతిరోజూ నువ్వులు అద్దిన రొట్టెలను తింటారు.

Advertisement

Advertisement

సజ్జలు పండే ప్రాంతాల్లో సజ్జలు నువ్వుల రొట్టెలు భుజిస్తారు. సజ్జలు, నువ్వులు ఉష్ణాన్ని కలిగిస్తాయి. కాబట్టి సజ్జ రొట్టెలు చలికాలంలో చాలామంచివి. ఇక సంక్రాంతినాడు వివిధ రకాలైన కూరగాయలు కలిపి వండుకుంటారు. బ్రాహ్మణులకు కూరగాయలు, ధాన్యం, దక్షిణ ఇచ్చి గౌరవిస్తారు. జ్యోతిశశాస్త్రపరంగా చూస్తే… సంక్రాంతి నెలకు ఓసారి వస్తుంది. జ్యోతిశశాస్త్రంలో 12 నక్షత్రరాశులను ఏర్పాటుచేశారు. ఒక్కొక్క మాసంలో సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. ఆయా రాశుల పేర్లతో సంక్రాంతిని వ్యవహరిస్తారు. వీటిలో ముఖ్యమైనది మకర సంక్రాంతి. అంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరం వైపు సంచరించడం మొదలుపెడతాడు. అందుకే ఈ కాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఇక సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే దాన్ని కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు. ఇక్కడినుంచి సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం మొదలుపెడతాడు. ఇది దక్షిణాయనం. రెండు ఆయనాలు ఆరు నెలల చొప్పున సంవత్సరం పూర్తవుతుంది. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమని భావిస్తారు.

Visitors Are Also Reading