Home » శివుడికి ఖిచ్డీకి సంబంధం ఏంటి ? సంక్రాంతికి ఖిచ్డీని దానం చేస్తే అలా జరుగుతుందా ?

శివుడికి ఖిచ్డీకి సంబంధం ఏంటి ? సంక్రాంతికి ఖిచ్డీని దానం చేస్తే అలా జరుగుతుందా ?

by Anji
Ad

సాధారణంగా  ఖిచ్డిని దక్షిణాసియా వంటకాలలో బియ్యం, పప్పుతో తయారు చేసే వంటకం. భారతీయ సంస్కృతిలో ఉత్తర ప్రాంతాలలో పిల్లలు తినే మొదటి ఘన ఆహారాలలో ఇది ఒకటి. మకర సంక్రాంతిని పౌషమాసం కృష్ణ పక్షంలో జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజు సూర్య భగవానుని ఆరాధించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పండుగ వేడుకకు ఖిచ్డీకి ప్రాముఖ్యత ఉంది. ఖిచ్డీని నవగ్రహ ప్రసాదంగా గ్రంధాలలో పేర్కొన్నారు. దీనిని తినడం వల్ల అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణ కథలు చెబుతున్నాయి. మకర సంక్రాంతి రోజు ఖిచ్డీని తయారు చేసే సంప్రదాయం ఉంది. దీనిలో నువ్వులు, బెల్లం, పెరుగు,పోహా కలిపి ఈ వంటకం తయారు చేస్తారు.

Advertisement

ఖిచ్డీలో బియ్యం, పప్పులు, పసుపు, పచ్చి కూరగాయలు మొదలైన పదార్థాలను కలుపుతారు. ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్కటి వివిధ గ్రహాలతో సంబంధం కలిగి ఉంది. ఇందులో.. ఖిచ్డి చంద్రుడు, శుక్రుడికి సంబంధించినదని భక్తులు నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతితో పసుపు, నెయ్యి సంబంధంతో.. మకర సంక్రాంతి నాడు సరైన సూచనలతో తయారు చేసిన వంటకం. శాంతిని ఆకర్షించడానికి సమగ్ర నివారణగా చెబుతారు. ఇది కాకుండా.. ఖిచ్డీలోని నల్ల పప్పు శని, రాహు-కేతువుల యొక్క దుష్ప్రభావాలను నిర్మూలించేదిగా చెబుతారు. ఇలా చేసిన ఖిచ్డీని దేవతలకు నైవేద్యంగా పెట్టి తినడం వల్ల నవగ్రహ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆరోగ్యం ఏడాది పొడవునా చక్కగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శుభ ఫలితాల కోసం పేదలకు దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.

Advertisement

పురాణాల ప్రకారం.. శివుడు బాబా గోరఖ్‌నాథ్‌గా అవతరించినప్పటి నుంచి ఖిచ్డీ తినే సంప్రదాయం ఉంది. ఖిల్జీ, అతని సైన్యంతో నాథ్‌యోగి చేసిన యుద్ధంతో కథ ప్రారంభమవుతుంది. అతను ఆహారం వండలేదు, తినలేదు. రోజుల తరబడి ఆకలితో ఉన్న కారణంగా..అతని భౌతిక శరీరం దాని శక్తిని కోల్పోతుంది. శక్తిని పునరుద్ధరించడానికి, బాబా గోరఖ్‌నాథ్ పప్పులు, బియ్యం, కూరగాయలను కలిపి ఒక వంటకాన్ని తయారు చేయమని అడిగారు. దీనికి ఖిచ్డీ అని పేరు పెట్టారు. దీనిని తిన్న కొద్దిసేపటికే యోగి శక్తిని తిరిగి పొందాడు. ఆ రోజు నుంచి బాబా గోరఖ్‌నాథ్‌కి ఖిచ్డీని నైవేద్యంగా పెట్టే సంప్రదాయం కొనసాగుతుంది.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading