దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ గురించి అందరికీ తెలిసినదే. జనవరి 07న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా విడుదల కాకుండా పోయింది. అప్పుడు విడుదల అయి ఉంటే ఈ పాటికి రెండు వారాలు కూడా పూర్తి చేసుకునేది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అభిమానులు పండగచేసుకునేవారు. కానీ అభిమానుల, నిర్మాత దురదృష్టమో ఏమో కానీ ఈ సినిమా వాయిదా పడింది. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ఆర్.ఆర్ ఆర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నది చిత్రబృందం.
Advertisement
పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే మార్చి 18న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 18 ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలవ్వకపోయిన కానీ.. నిత్యం ఆర్ఆర్ఆర్ గురించి ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.తాజాగా ఆర్ ర్ క్లైమాక్స్ న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్ విన్న అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్ కోసమే ఎన్టీఆర్ రామ్ చరణ్ రెండు నెలల కాలం కొన్ని విద్యలో శిక్షణ కూడా తీసుకున్నారట.
Advertisement
ఈ క్లైమాక్స్ కోసం నిర్మాత దాదాపుగా 90 కోట్ల ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆడియన్స్ క్లైమాక్స్ కు ఇస్తున్న భరోసాతోనే అగ్ర దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ క్లైమాక్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ఈ విధంగా ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరొకవైపు ఇద్దరు అగ్ర హీరోలు ఈ సినిమాలో చనిపోతారేమో క్లైమాక్స్ లో అని భయపడుతున్నారు. కానీ హీరోలు ఇద్దరు చనిపోరని.. అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం లో భాగంగానే ఇద్దరు వైకల్యం పొందుతారని ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ వింటేనే అభిమానులు కాస్త షాక్ కు గురైన ఎమోషనల్ క్లైమాక్స్ కి మాత్రం ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు.