Home » ఇజ్రాయెల్‌కు మద్దతుగా వ్యాఖ్యలు.. సౌతాఫ్రికా కెప్టెన్ కి షాక్..!

ఇజ్రాయెల్‌కు మద్దతుగా వ్యాఖ్యలు.. సౌతాఫ్రికా కెప్టెన్ కి షాక్..!

by Anji
Ad

త్వరలో అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న సౌతాఫ్రికా సొంత జట్టు కెప్టెన్‌కు షాకిచ్చింది. సఫారీ అండర్‌ – 19 సారథి డేవిడ్‌ టీగర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా గతంలో అతడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఈ మేరకు క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఎ) ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. టీగర్‌ వ్యాఖ్యలతో త్వరలో జరుగబోయే అండర్‌ – 19 ప్రపంచకప్‌లో అశాంతి రేగే అవకాశమున్నదని, ఆందోళనలు, నిరసనలు జరిగే ఛాన్స్‌ ఉందని సమాచారం అందుకున్న సీఎస్‌ఎ, భద్రతా కారణాల దృష్ట్యా అతడిని తొలగించింది. ఇదే విషయాన్ని ప్రకటలో కూడా పేర్కొంది.

Advertisement

Advertisement

పాలస్తీనాపై గతేడాది అక్టోబర్‌ నుంచి బాంబులతో విరుచుకుపడుతూ అక్కడ హమాస్‌ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ అడుగులు వేస్తున్నది. టీగర్‌ కూడా ఇజ్రాయెల్‌ నుంచి సౌతాఫ్రికాకు వలసవచ్చినవాడే. అక్టోబర్‌లో ఓ కార్యక్రమం (రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఎబీఎస్‌ఎ జ్యూయిష్‌ అచీవర్‌) లో పాల్గొన్న 19 ఏండ్ల టీగర్‌… ‘అవును, నేనిప్పుడే రైజింగ్‌ స్టార్‌నే. కానీ నిజమైన రైజింగ్‌ స్టార్స్‌ మన (ఇజ్రాయెల్‌) సైనికులు. నేను ఈ అవార్డును వారికి అంకితమిస్తున్నాను. వారి వల్లే మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading