సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు చిన్న హీరోల సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడుతుంటారు. కానీ కొంత మంది కంటెంట్.. సినిమా బాగుంటే స్టార్ హీరోలకు పోటీగా చిన్న సినిమాలను తీసుకొస్తున్నారు. చాలా రోజుల నుంచే నడుస్తుంది. 2004లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ వచ్చింది. అందరూ ఊహించినట్టే మెగాస్టార్ హిట్ కొట్టాడు. కానీ అదే సమయంలో థియేటర్లలో చిన్న సినిమా ఆనంద్ కూడా విడుదలైంది.
Advertisement
వాస్తవానికి ఈ సినిమా గురంచి అప్పట్లో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. ఇప్పటిలాగా అప్పుడు సోషల్ మీడియా లేదు. శంకర్ దాదా MBBS సినిమాకు టికెట్లు దొరకని వారు పక్కనే ఖాళీగానే ఉంది కదా అని ఆనంద్ సినిమాకు వెళ్లేవారు. అలా చూసిన వారందరూ బాగుంది అని టాక్ రావడంతో ఆనంద్ మూవీ సూపర్ హిట్ అయింది. సరిగ్గా 20 ఏళ్ల తరువాత కూడా అదే రిపీట్ అయిందనే చెప్పాలి. బడా హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల సినిమాలు వచ్చినప్పటికీ.. హనుమాన్ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదేరోజు గుంటూరు కారం మూవీ కూడా రావడంతో జనవరి 11న సాయంత్రం నుంచే ప్రీమియర్స్ వేశారు.
Advertisement
జనవరి 11 నుంచి హనుమాన్ మూవీ సంక్రాంతి హిట్ మూవీ అని.. పెద్ద హీరోల సినిమాలు పడిపోతాయనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు నెటిజన్స్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ని ట్రోల్స్ చేస్తున్నారు. రూ.600 కోట్లు పెట్టి ఆదిపురుష్ వంటి సినిమా తీశారు. కానీ తక్కువ ఖర్చుతో హనుమాన్ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని పొగుడుతున్నారు. మొత్తానికి ఈ పండుగకు హనుమాన్ మంచి సినిమా అనే చెప్పవచ్చు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!