Home » ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు.. టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు కెప్టెన్లు వీళ్లే..!

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు.. టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు కెప్టెన్లు వీళ్లే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా టీ20 క్రికెట్ అంటే చాలా ఇష్టం. తక్కువ సమయంలో అభిమానులకు పూర్తి వినోదం లభించడమే అందుకు కారణం. ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటుంది. ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడటానికి ఇదే కారణం. ఇక్కడ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తారు. చాలా పరుగులు చేస్తుంటారు.  ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు టీ20లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిలో కొందరు ఆటగాళ్లు కెప్టెన్‌గా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. కెప్టెన్‌గా ఒక T20 మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అరోన్ పింఛ్ : 

ఈ జాబితాలో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతను 3 జులై 2018న హరారేలో జింబాబ్వేపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్ 76 బంతుల్లో 16 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 172 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

షహ్ర్యార్ బట్ :

ఈ జాబితాలో చెక్ రిపబ్లిక్‌పై అద్భుత సెంచరీ చేసిన బెల్జియం ఆటగాడు షహర్యార్ బట్ రెండో స్థానంలో ఉన్నాడు. 29 ఆగస్టు 2020న జరిగిన ఈ మ్యాచ్‌లో, చెక్ రిపబ్లిక్‌పై షహర్యార్ బట్ కేవలం 50 బంతుల్లో 11 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 125 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తనకవాత బెల్జియం 197 పరుగులు చేసి చెక్ రిపబ్లిక్‌ను 151 పరుగులకే పరిమితం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది.

షేన్ వాట్సన్ : 

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వాట్సన్ 31 జనవరి 2016న సిడ్నీలో భారత్‌పై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో వాట్సన్ 71 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading