సాధారణంగా ఈ సీజన్ లో రేగుపండ్లు ఎక్కువగా పండుతాయి. సంక్రాంతి పండుగకి వీటిని దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. రేగు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా రక్త హీనత సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే రేగు పండ్లు తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. అదే విధంగా శరీరానికి కూడా అనేక పోషకాలు అందుతాయి. సంక్రాంతి పండక్కి.. రేగు పళ్లకు కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగ సమయంలో రేగి పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది.
Advertisement
సంక్రాంతికి ముందు భోగి పండుగ వస్తుంది. భోగి రోజున చిన్న పిల్లలకు తల స్నానం చేయించి.. ఎంత మంది పిల్లలు ఉన్నా.. వారికి రేగి పండ్లను పోస్తారు. వారి మీద నుంచి పోసిన రేగు పండ్లను పట్టుకుని తింటూంటారు. దీని వల్ల వారికి చాలా మంచి జరుగుతుందని, పిల్లల ఆయుషు పెరుగుతుందని పెద్దలు విశ్వసిస్తారు. ఈ రకంగా అయినా పండ్లను తినడం వల్ల మంచి జరుగుతుందని ఓ నమ్మకం ఉంది. ఇక రేగు పండ్లతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
రేగు పండ్ల వల్ల ఉపయోగాలు :
- రేగు పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఏ మాత్రం ఆలోచించకుండా వీటిని తినొచ్చు. ఇవి తింటే షుగర్ పేషెంట్స్‌లో చక్కెర స్థాయిలు పెరగవు.
- రేగు పండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్త హీనత సమస్య ఉన్నారు, ఐరన్ లోపం ఉన్న వారు రేగు పండ్లను తింటే ఆ సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి తప్పకుండా తినండి.
- రేగు పండ్లు తింటే ఎముకలు, దంతాలు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చిన్న పిల్లకు పెడితే వారి ఎముకలు గట్టి పడతాయి. వయసు మీద పడ్డవారు తిన్నా ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.
- రేగు పండ్లు తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇవి తింటే చర్మంపై దద్దర్లు, దురదలు రావు. అదే విధంగా పొడి బారడం, నిర్జీవంగా ఉన్న చర్మం కాంతి వంతంగా మారుతుంది.
- అంతే కాకుండా జీర్ణ సమస్యలతో బాధ పడేవారు రేగు పండ్లు తీసుకుంటే మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా రేగు పండ్లు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.