టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీ అగ్ర నిర్మాతల్లో ఒకరు. ఈయన తాజాగా అల్లు అరవింద్ తన 75వ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఈయన 1949, జనవరి 10 న జన్మించారు. అల్లు అరవింద్ తన తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లో హీరోగా.. లేదా విలన్ గా.. కమెడియన్ గా.. చేస్తారని అందరూ భావించారు. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా ఈయన నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. అయితే సినిమాల్లో నటించకుండా ఆయన నిర్మాతగా ఎందుకు మారారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అల్లు అరవింద్ తొలుత తన తండ్రి అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని సినిమాల్లో చిన్నచిన్న కామెడీ రోల్స్ లో చేశారట. కానీ తనకి సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. ఎందుకంటే తాను ఒకరి సినిమాల్లో నటించడం కాదు తానే స్వయంగా సినిమాలు నిర్మించాలి అని గట్టిగా అనుకున్నారట. అలా నిర్మాతగా మారాలి అనేదానికి ఆయనే పునాదులు వేసుకున్నారు. ఆ తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తీశారు. మొదట ఈయన దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంట్రోతు భార్య అనే మూవీని తెరకెక్కించారు.ఆ తర్వాత మళ్లీ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన దేవుడు దిగివస్తే అనే సినిమాకి నిర్మాతగా చేశారు.
Advertisement
అలా ఈయన చేసిన ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో సినిమాల్లో ప్రొడ్యూసర్ గా చేయాలనే ఇంట్రెస్ట్ మరింత పెరిగి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి స్టార్ నిర్మాతగా మారారు అల్లు అరవింద్. అంతేకాదు.. ఈయన ఆహా అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ని కూడా స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాల్లో నటించడం కంటే తానే స్వయంగా సినిమాలను తెరకెక్కించడం బెస్ట్ అని భావించిన అల్లు అరవింద్ చివరికి టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. ఆయన ఇంత వయసు వచ్చినా కూడా సినిమాల్లో బిజీ బిజీగానే ఉంటారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి ఈయన ఒక వెన్నెముక లాంటివారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరినీ ఈయనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఎదగడానికి ఒకరికొకరు ఎంతగానో సహాయం చేసుకున్నారు.