Home » తన మొదటి సంపాదనను గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ అయిన సమంత..!

తన మొదటి సంపాదనను గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ అయిన సమంత..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఏమాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. తెలుగులోనే కాదు.. తమిళం లో కూడా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తమిళంలో స్టార్ హీరోలు అయిన సూర్య, విజయ్ దళపతి, విక్రమ్ వంటి హీరోలతో నటించింది సమంత. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది.

Advertisement

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తరువాత సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మయోసైటిస్ కారణంగా ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంది సమంత. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది. సమంత ఇప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వేదికపై సమంత బాల్యం గురించి సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది.

Advertisement

ముఖ్యంగా తన కష్టాల గురించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను అనుభవించానని తెలిపింది. మా తల్లిదండ్రులు ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడే వాళ్లు. అందుకే చిన్నప్పటి నుంచే తనను బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు సూచించినట్టు వెల్లడించింది. తాను కూడా బాగా చదివేదానిని అని.. పై చదువులు చదవాలనుకున్న కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదని తెలిపింది. ఆ సమయంలో ఏ పని దొరికితే ఆ పని చేశానని.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పని చేసేదానినని వెల్లడించింది. చదువుకుంటూనే ఓ స్టార్ హోటల్ లో పని చేశానని.. అప్పుడు నెలకు రూ.500 ఇచ్చేవారు. ఇదే నా మొదటి సంపాదన అని తెలిపి చాలా ఎమోషనల్ అయ్యారు సంపాదన.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading