తేజా సజ్జా హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన హను-మాన్ మూవీ జనవరి 12న విడుదల కాబోతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా 12 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమా ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి తన ప్రసంగంతో సినిమా టీంతో పాటు అభిమానులకు ఉత్సాహం కలిగేలా చేశారు. ఈ సందర్భంగా హను-మ్యాన్ అంటూ టైటిల్ లో మధ్యలో డాష్ మార్క్ పెట్టి ప్రత్యేకత కలగజేయడం వెనక ఉన్న కారణాన్ని వివరించారు.
Advertisement
గతంలో ఆహా కోసం సమంత నిర్వహించిన టాక్ షోకి చిరంజీవికి ఎదురైన ప్రశ్న స్పైడర్ మాన్, బ్యాట్ మాన్, సూపర్ మాన్ మీకు ఎవరంటే ఇష్టమని అడగగా, దానికి చిరంజీవి ఎవరో ముక్కు మొహం తెలియని హాలీవుడ్ సూపర్ హీరోల గురించి చెప్పడం ఎందుకని, తన ఇష్ట దైవం హనుమాన్ పేరుని హనుమ్యాన్ అని పలికి సమాధానం చెప్పారు. ఇదే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ని ఆకట్టుకుంది. ఇలా టైటిల్ లాక్ చేసుకునేందుకు ప్రేరేపించిందట. ఈ రకంగా ప్రభావితం చెందటం తనకే ఎంతో సంతోషం కలిగిందని చిరంజీవి చెప్పారు. అంతేకాదు.. నిజ జీవితంలో ప్రత్యేకంగా గుడులకు పోకపోయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాత్రి పడుకునే ముందు ఆంజనేయుడిని తలచుకోవడం వల్ల ఉదయం లేవగానే పరిష్కారం దొరికేదని అంతా మహత్తు హనుమంతుడికి ఉందని అన్నారు.
Advertisement
మొత్తానికి చిరంజీవి రావడం వల్ల హనుమాన్ ఈవెంట్ లో సందడి నెలకొంది. మధ్యలో గొంతు చీరపోయిన ఇబ్బంది పెడుతున్న పేరుపేరునా అందరిని ప్రస్తావించి మెచ్చుకుంటూ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడతాయని థియేటర్ల సమస్య వల్ల మొదటి రోజు, లేదా ఫస్ట్ షో చూడకపోయినా తర్వాత కంటెంట్ బాగుంటుందని తెలిస్తే ప్రేక్షకులు కచ్చితంగా వస్తారని చెప్పారు. గతంలో ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదల అవ్వబోయే టైంలో దిల్ రాజు శతమానం భవతి విడుదల చేసి విజయాన్ని దక్కించుకున్నారు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆడుతుందని దిల్ రాజు చెప్పారు. అలానే హను-మాన్ సినిమా కూడా ఖచ్చితంగా ఆడుతుందని మెగాస్టార్ తెలిపారు. జనవరి 11న సాయంత్రం హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లలో హను-మాన్ మూవీ ప్రీమియర్స్ బుకింగ్స్ ప్రారంభం కావడం విశేషం.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!