డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు డ్యాన్స్ చేయడానికి కష్టపడుతుంటారు. కానీ కొందు మాత్రం డ్యాన్స్ ను తెగ ఎంజాయ్ చేస్తూ చేస్తుంటారు. అలా తెలగు హీరోయిన్లలో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే హీరోయిన్ సాయిపల్లవి. మెదటగా సాయిపల్లవి డీ డ్యాన్స్ షో ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన డ్యాన్స్ తో జడ్జ్ లను మెప్పించింది. అప్పుడే సాయి పల్లవి హీరోయిన్ అవుతుందని షోలోని జడ్జిలు చెప్పేశారు.
Advertisement
ఇక అదే నిజం అయ్యింది కూడా…మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమమ్ తో సాయిపల్లవి చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది. అంతే కాకుండా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో వరుస ఆఫర్లను అందుకుంది. ఇక ఫిదా సినిమాలో సాయిపల్లవి చేసిన వచ్చిందే మెల్లమెల్లగా వచ్చిందే పాట యూట్యూబ్ ను షేక్ చేసింది.
Advertisement
అంతే కాకుండా ధనుష్ తో సాయిపల్లవి స్టెప్పులు వేసిన రౌడీ బేబీ పాట కూడా యూట్యూబ్ ను ఊపేసింది. ఇక రీసెంట్ గా సాయిపల్లవి హీరోయిన్ గా శ్యామ్ సింగరాయ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో కూడా సాయిపల్లవి తన స్టెప్పులతో అలరించింది.
ప్రణవాలయ అంటూ సాగే క్లాసికల్ సాంగ్ లో భరత నాట్యం చేసి ఔరా అనిపించింది. ఇక సాయిపల్లవి ఈ పాట కోసం చేసిన రిహాల్సల్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సాయిపల్లవి మరో ఇద్దరు డ్యాన్సర్ లతో కలిసి ఎంతో చక్కగా స్టెప్పులు వేస్తోంది. అంతే కాకుండా ఈ పాట కోసం సాయి పల్లవి ఎంతో కష్టపడినట్టు కనిపిస్తోంది.
ALSO READ : రియల్ లైఫ్ శ్యామ్ సిగారాయ్ స్టోరీ…మళ్లీ పుట్టానని చెబుతున్న 4 ఏళ్ల బాలిక…!
https://fb.watch/aLp3SfDy6k/