Home » మొగ‌ల్ కింగ్ బాబ‌ర్ కి శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లంటే ఎందుకంత భ‌యం?

మొగ‌ల్ కింగ్ బాబ‌ర్ కి శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లంటే ఎందుకంత భ‌యం?

by Azhar
Ad

మొగ‌ల్ వంశ స్థాప‌కుడైన బాబ‌ర్ ద‌క్షిణ భార‌త‌దేశంలోని చాలా ప్రాంతాల‌పై క‌న్నేసి వాటిని ఆక్ర‌మించుకున్నాడు . కానీ అదే ద‌క్షిణ భార‌త‌దేశంలో ఉన్న విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాన్ని మాత్రం ట‌చ్ చేయ‌లేదు. దానికి కార‌ణం ఆ సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు. బాబ‌ర్ శ్రీకృష్ణ దేవ‌రాయ‌ల‌మీద యుద్దం చేయ‌డానికి భ‌య‌ప‌డ్డాడా? అంటే భ‌యం కంటే కూడా చాక‌చ‌క్య‌త ప్ర‌ద‌ర్శించాడ‌ని చెప్పాలి. దేవ‌రాయ‌ల‌తో యుద్దం చేస్తే తానే న‌ష్ట‌పోతాన‌ని భావించి చాలా తెలివిగా శ్రీకృష్ణ దేవ‌రాయ‌ల‌తో వైరం పెంచుకోలేదు.

Also Read: రియల్ లైఫ్ శ్యామ్ సిగారాయ్ స్టోరీ…మళ్లీ పుట్టానని చెబుతున్న 4 ఏళ్ల బాలిక…!

Advertisement

సైన్యం : అప్ప‌ట్లోనే శ్రీకృష్ణ దేవ‌రాయ‌ల వ‌ద్ద 50వేల మంది వీర సైనికుల సైన్యంతోపాటు పోర్చుగీసుకు చెందిన ఫిరంగులు ఉండేవి. 3200 మంది అశ్వ‌ద‌ళం, 600 గ‌జ‌ద‌ళంతో పాటు 4 ల‌క్ష‌ల మంది ప‌దాతి ద‌ళం ఉండేది. ద‌క్షిణ ఆసియాలోనే సంఖ్యాప‌రంగా, ప‌రాక్ర‌మ ప‌రంగా రాయ‌ల‌వారిది పెద్ద సైన్యం. 900కు పైగా ఫిరంగులతో యుద్దానికి దిగిన బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాను రాయ‌ల సైన్యం చిత్తుచిత్తుగా ఓడించింది.

Advertisement

బాబ‌ర్ శ్రీకృష్ణదేవ‌రాయ‌ల‌ను ట‌చ్ చేయ‌కపోవ‌డానికి కార‌ణాలు

  • బాబ‌ర్ కు 50వేల మంది సైనికులు, 50 ఫిరంగులు మాత్ర‌మే ఉండేవి. ఇది శ్రీకృష్ణ దేవ‌రాయ‌ల సైన్యంతో పోల్చితే చాలా త‌క్కువ. ఒక్క హంపీ లోనే రాయ‌ల‌కు ఈ సైన్యం ఉండేది.

  • బాబ‌ర్ రాజుగా ఎస్టాబ్లిష్ అవుతున్న స‌మ‌యానికే రాయ‌లు ప‌రాక్ర‌మ రాజుగా పేరుగాంచాడు.
  • బాబర్ ముందుగా గుజ‌రాత్, రాజ‌స్తాన్, బెంగాల్ సామ్రాజ్యాల‌పై క‌న్నేశాడు.
  • రాయ‌ల మీద యుద్దానికి పోతే విచ్ఛిన్నంగా ఉన్న ద‌క్షిణ భార‌త రాష్ట్రాలు క‌లిసి త‌న మీద‌కు తిరుగుబాటు చేస్తాయేమోన‌నే భ‌యం.

Also Read: సౌత్ స్టార్ల‌పై కంగ‌నా ఏమ‌న్నారో తెలుసా..?

Visitors Are Also Reading